ముగించు

పాండవుల గుట్టలు

దర్శకత్వం
వర్గం అడ్వెంచర్, వినోదభరితమైనవి, సహజ/రమణీయమైన సౌందర్యం

       పాండవుల గుట్టలు జయశంకర్  భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 22  కి.మీ. దూరంలో, వరంగల్ –   మహదేవపూర్ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవులగుట్టలున్నాయి. ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాకృతులు కన్పిస్తాయి. ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండవాళ్ళు. ఆ కొండగోడలపై అపురూపమైన ప్రాచీన రాతిచిత్రాలు.

      పాండవులగుట్టల్లో ‘ఎదురుపాండవులు, గొంతెమ్మగుహ, పంచపాండవులు, పోతిరాజు చెలిమె, మేకలబండ, ముంగీసబండ, తుపాకులగుండు, యానాదుల గుహ’లు చూడాల్సిన ప్రదేశాలు. వాటిలో ఎదురుపాండవులు దానికి కుడిపక్కన వెనకవైపు గుహలు, గొంతెమ్మగుహ, పంచపాండవుల దొనెల్లో అద్భుతమైన శిలాశ్రయచిత్రాలున్నాయి. ప్రాక్ యుగం నుండి చారిత్రకయుగం దాకా వేయబడిన రాతిచిత్రాలెన్నో అప్పటి జీవనశైలీ వైవిధ్యాల్ని కనువిందు చేస్తున్నాయి. కొన్నిచోట్ల పాతబొమ్మల మీదనే కొత్తబొమ్మలు వేసిన జాడలగుపిస్తున్నాయి. ఆరుచోట్ల వున్న చిత్రిత శిలాశ్రయాల్లో అన్నిబొమ్మలు ముదురు ఎరుపురంగుతో చిత్రించబడ్డవే. మందమైన గీతలతో చదునైన పూతలతో గీయబడిన ఈ బొమ్మల్లో శాకాహార, మాంసాహార జీవులు, మనుషుల బొమ్మలు వున్నాయి. వీటిలో జింకలు, చేపలు, మేకలు, కుక్కలు, ముళ్ళపందులు, కుందేళ్ళు, తాబేలు, పాము, చిలుక, సీతాకోకచిలుకలు, కొండెంగ, నెమలి, కప్ప,బల్లి, ఎలుగుబంటి, పెద్దపులులు, పండు, వలతో మనుషులు, పులి వంటి జంతువును చంపిన సరీసృపం వంటి పెద్ద జంతువు, కుందేళ్ళను తరుముతున్న కుక్కలు, కుక్కలు చుట్టి నిలుచున్న మనిషి, ఈనిన జింక, జింకపిల్లను నాకుతున్న దృశ్యాన్ని చూస్తున్న మనిషి, త్రిభుజాలు, త్రిశూలం, చుక్కల వంటి రేఖాకృతులు, కొన్ని శిథిలచిత్రాలు, ఇవేకాక గొంతెమ్మగుహలో చేతిగుర్తులు, యుద్ధం చేస్తున్న వీరుల బొమ్మ లున్నాయి. పంచపాండవుల గుహలో రంగులలో పంచపాండవులు, కుంతి, ద్రౌపది, ద్రుపదుడు, పాండవుల పెండ్లి, శేషశాయి, గణేశుడు, శివలింగం, ఆంజనేయుడు, బ్రహ్మ, సరస్వతుల చిత్రాలున్నయి.

 • పాండవుల గుహ రాక్ పెయింటింగ్
 • పాండవుల కేవ్స్ పెయింటింగ్
 • పాండవుల కేవ్స్ - అరుదైన రాక్ ఆర్ట్
 • రాక్ క్లయిమబింగ్
 • ట్రెక్కింగ్ ఇన్ ఫారెస్ట్
 • పాండవుల గుట్ట లో ప్రవేశము
 • పాండవుల గుహలు
 • పాండవుల కేవ్స్
 • పాండవ టూరిజం
 • రాక్ క్లయిమబింగ్
 • ట్రెక్కింగ్
 • పాండవుల గుట్ట

ఎలా చేరుకోవాలి?:

రైలులో

రెగోండాకు సమీపంలో రైల్వే స్టేషన్ లేదు. అయితే సమీప వరంగల్ రైల్వే స్టేషన్, కాజిపేట రైల్వే స్టేషన్ నుండి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మీరు వరంగల్ నుండి రెగోండా వరకు రహదారి ద్వారా చేరుకోవచ్చు

రోడ్డు ద్వారా

రెగొండ మండల్ హెడ్ క్వార్టర్స్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో రావులపల్లి సమీపంలో పాండవుల గుత్తా ఉంది. రెగోండా నుండి, వరంగల్ దాదాపు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము బస్సు ద్వారా లేదా క్యాబ్ ద్వారా కూడా చేరుకోవచ్చు.

దృశ్యాలు