ముగించు

భూపాలపల్లి ఇ ఫ్రెష్ కార్యక్రమం

ప్రచురణ తేది : 24/04/2020

భూపాలపల్లి ఇ ఫ్రెష్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి మొబైల్ వ్యాన్ ద్వారా నిత్యావసర సరుకులను సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు. జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం హైదరాబాద్ కు చెందిన సిప్లిజీత్ టెక్నాలజీ వారి సహకారంతో ఆన్లైన్లో ఫోన్ ద్వారా ఆర్డర్లను తీసుకొని ఇంటి వద్దకే అవసరమైన నిత్యావసర సరుకులను అందించేందుకు మొదటిసారి భూపాలపల్లి పట్టణంలో భూపాలపల్లి ఈ ఫ్రెష్ పేరుతో నిత్యావసర సరుకుల రవాణా కార్యక్రమంలో చెప్పడం జరిగింది. 

ఫోన్ కాల్ ద్వారా ఆర్డర్ తీసుకొని సంచార వాహనం ద్వారా ఇంటింటికి సరుకులను అందించాలనే ఉద్దేశంతో  భూపాలపల్లి ఇ ప్రెస్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఇందులో భాగంగా 9133369990 ఫోన్ నెంబర్ ను ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజల నుంచి ఫోన్ ద్వారా ప్రజలకు అవసరమైన ఆర్డర్లను స్వీకరించి మరుసటి రోజు ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను సరఫరా చేయడం జరుగుతుంది కాబట్టి భూపాలపల్లి పట్టణంలో కరోనా కేసులు నమోదై కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించబడిన ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే సరఫరా చేసేందుకు మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటామని తెలిపారు.

అదేవిధంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల నుంచి కూడా ఆర్డర్లను తీసుకొని సరఫరా చేస్తా ము కాబట్టి భూపాలపల్లి పట్టణ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇంటి వద్దనే నిత్యావసర సరుకులను పొందాలని పిలుపునిచ్చారు.

మీ ఆర్డర్ చేసుకోండి : 9133369990